'ఉగ్ర మూలాలు సమూలంగా నిర్మూలించాలి'

'ఉగ్ర మూలాలు సమూలంగా నిర్మూలించాలి'

KMR: దేశంలో ఉగ్ర మూలాలను సమూలంగా నిర్మూలించాలని, టీజీఏ అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్ అన్నారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో పాహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన 28 మంది అమాయకపు పర్యాటకుల ఆత్మ శాంతించాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మత ప్రాతిపదికన కాల్చి చంపడం దుర్మార్గమైన చర్య అన్నారు.