15 మంది నోడల్ అధికారుల నియామకం
KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13విభాగాలుగా విభజించి 15మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు 15మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.