మూడు గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ లభ్యం

మూడు గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ లభ్యం

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తప్పిపోయిన ఐదేళ్ల బాలికను టూటౌన్ పోలీసులు 3 గంటల వ్యవధిలో గుర్తించి, తల్లికి అప్పగించారు. ధర్మవరానికి చెందిన కీర్తి తన కూతురు అలేఖ్య (5)ను ఆసుపత్రి మెయిన్‌ గేట్‌ వద్ద వదిలి టిఫిన్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి కనపడలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా.. సీఐ శ్రీకాంత్‌ ప్రత్యేక బృందాలతో గాలించి, పాపను సురక్షితంగా అప్పగించారు.