సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
W.G: పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిది భరోసాగా నిలుస్తుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో 60 మందికి సంబంధించి మంజూరైన రూ. 25,53,171 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని బాబ్జి అడిగి తెలుసుకున్నారు.