వరల్డ్ హెల్త్ డే ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్
GDWL: ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉండడం ప్రధానమని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఎవరైనా సరే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా పాత DHMO కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి హెల్త్ డే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.