మాట నిలబెట్టుకున్న సర్పంచ్
హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌లోని కరుణాపురంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గుర్రపు రీనా-ప్రవీణ్ గెలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు ఆడపిల్ల పుడితే రూ.5,000 ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇటీవల గ్రామంలో హరీష్-బిందు ఆడపిల్లకు జన్మనివ్వగా, వారికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి మాట నిలబెట్టుకున్నారు.