VIDEO: 'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో ఆత్మహత్యలు'
SRCL: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు.