VIDEO: ముగిసిన వెంకన్న కళ్యాణ మహోత్సవాలు
AKP: నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత నెల 26 నుంచి నిర్వహించిన తిరు వార్షిక కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిసాయి. మూడవ రోజు పుష్పయాగోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి లడ్డు కౌంటర్ ఏర్పాటు చేసి భక్తులకు లడ్డూలను విక్రయించారు.