భారత్‌పై ఎవరు దాడి చేసినా సహించేది లేదు: పవన్

AP: ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 3 ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసిందని తెలిపారు. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు. మోదీ నేతృత్వంలో ధీటుగా బదులిచ్చామని పేర్కొన్నారు. భారత్‌పై ఎవరు దాడి చేసినా సహించేది లేదని తేల్చి చెప్పారు. దేశ భద్రత విషయంలో ఇన్‌ఫ్లూయెన్సర్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.