భారీగా తగ్గనున్న ధరలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడళ్ల ధరలను తగ్గించింది. జీఎస్టీ 2.0 అమలు నేపథ్యంలో కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. స్విఫ్ట్‌పై గరిష్ఠంగా రూ.1.06 లక్షల వరకు తగ్గనుంది. ఎంట్రీ లెవల్ వేరియంట్‌పై రూ. 55 వేలు తగ్గింపు లభించనుంది. దీంతో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.94 లక్షలు(ఎక్స్ షోరూమ్) కానుంది.