కోలవెన్నులో రైతన్న మీకోసం కార్యక్రమం
కృష్ణా: కంకిపాడు మండలంలోని కోలవెన్ను గ్రామంలో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'రైతన్న మీకోసం' కార్యక్రమం జరిగింది. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పాటించాల్సిన పంచ సూత్రాలను రైతులకు వివరించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన రైతులకు సూచించారు.