'జనావాసాల మధ్య అదానీ సిమెంట్ యూనిట్ వద్దు'
VSP: జనావాసాల సమీపంలో అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటుపై సీపీఐ నిరసన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జి. ఆనంద్ డిమాండ్ చేశారు. ఇవాళ 64వ వార్డు గంగవరంలో సీపీఐ శ్రేణులు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.