'ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి'
SKLM: సరుబుజ్జిలిలో జడ్పీహెచ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ మూర్తి గ్రామస్తులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి పథకాల గురించి వివరించారు. ఇవాళ సరుబుజ్జిలిలో ప్రభుత్వ పాఠశాల సిబ్బంది ప్రచారాన్ని చేపట్టారు.