గోరంట్లలో రూ. 3.05 లక్షలకు వినాయకుని లడ్డు వేలం

గోరంట్లలో రూ. 3.05 లక్షలకు వినాయకుని లడ్డు వేలం

GNTR: గుంటూరు శివారులోని గోరంట్లలో ఉన్న ఏబీసీ వాటర్ వ్యూ గేటెడ్ అపార్ట్‌మెంట్‌లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన వినాయకుని లడ్డు వేలం పాటలో శివ అనే వ్యక్తి రూ.3.05 లక్షలకు లడ్డును దక్కించుకున్నారు. అనంతరం లడ్డును తలపై పెట్టుకుని మేళతాళాలతో ఇంటికి ఊరేగింపుగా వెళ్లారు.