'స్థానికంగా పవర్ లూమ్స్ ఏర్పాటు చేయాలి'

SRCL: తంగళ్ళపల్లి మండలం కేసీఆర్‌నగర్ ప్రజల కోసం స్థానికంగా పవర్లూమ్స్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా అధ్యక్షుడు మూసం రమేష్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గురువారం ఇంటింటికి సర్వే నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ వాటర్ రానప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.