‘ఈనెల 28న జడ్పీ సర్వసభ్య సమావేశం’

‘ఈనెల 28న జడ్పీ సర్వసభ్య సమావేశం’

VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీసీఈవో నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి, అల్లూరి, విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.