VIDEO: యూరియా కోసం తప్పని తిప్పలు

KNR: సైదాపూర్ మండలం వెన్కేపల్లి విశాల పరపతి సహకార సంఘం ఎదుట శనివారం మధ్యాహ్నం రైతులు యూరియా కోసం భారీ క్యూ లైన్ కట్టారు. సహకార సంఘానికి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు అర కిలోమీటర్ మేర భారీ క్యూ లైన్ కట్టారు. మండల వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఉండడంతో రైతులు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.