అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

MNCL: భీమారం మండల కేంద్రానికి చెందిన రైతు పోటు తిరుపతిరెడ్డి(50), వ్యాపారంలో నష్టాలు, అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిరెడ్డి వ్యవసాయంతో పాటు ఎరువుల దుకాణం కూడా నడిపేవాడు. వ్యాపారం సరిగా జరగకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలనే తీవ్ర మనోవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.