VIDEO: ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి

NRPT: ట్రాక్టర్ కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దూరు మండలం హనుమనాయక్ తండా దగ్గర బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన గణేష్ నాయక్ తన ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌లో రాళ్లు తరలిస్తున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.