VIDEO: బసవేశ్వరుడి భావజాలం చిరస్మరణీయం: యెన్నం

MBNR: కుల, వర్ణ, లింగ వివక్షలను నిరసించిన మహానుభావుడు బసవేశ్వరుడని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వరుడు ఒక గొప్ప సామాజిక తత్వవేత్తగా, సమానత్వానికి పాటుపడిన సంఘసంస్కర్త అని కొనియాడారు.