బాధితురాలి ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు
JN: జఫర్‌గడ్ మండలంలోని ఓ గ్రామంలో పోలీసులు బాధితురాలి ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మహిళపై అసభ్య ప్రవర్తనతో వేధింపులు జరుగుతున్నాయని డయల్100కు సమాచారం అందడంతో ఆదివారం ఎస్సై బి.రామారావు ఆమె ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే కేసు నమోదు చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ విధానం అమలులోకి తీసుకొచ్చారు.