స్పీకర్ అయ్యన్నపై పోలీసులకు ఫిర్యాదు

స్పీకర్ అయ్యన్నపై పోలీసులకు ఫిర్యాదు

NLR: పోలీసులపై దుర్భాషలాడిన స్పీకర్ అయ్యన్నపాత్రునిపై వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యత గల ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ ఫిర్యాదులో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.