'మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు'
NRPT: వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైత్యన్య హెచ్చరించారు. నారాయణపేట పట్టణంలోని పాత బస్టాండ్ కూడలిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ పత్రాల పరిశీలించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. వాహనదారులు హెల్మెట్, సిట్ బెల్ట్ వాడాలన్నారు.