'యాసంగి విత్తనాలపై 50 శాతం సబ్సిడీ'
GDWL: యాసంగి పంట కోసం రైతులకు మినుములు, శనగలు, జొన్నలు 50 శాతం సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. బుధవారం ఇటిక్యాల మండలం బీచుపల్లి రైతు వేదికలో వ్యవసాయాధికారి సురేష్ కుమార్ రైతులకు పత్తి కొనుగోలు ప్రక్రియ, కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించారు. రైతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పంట నమోదు నంబర్ ద్వారా రిజిస్టర్ చెయ్యాలని సూచించారు.