BC రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: CPI
HNK: BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అందుకోసం అఖిలపక్ష పార్టీల నాయకులతో CM రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాలని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇవాళ బాలసముద్రంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఈ విషయంలో బాధ్యత వహించి రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని కోరారు.