VIDEO: కోతుల సమస్యకు వినూత్న పరిష్కారం
JN: జఫర్ గడ్ మండలం రఘునాథ్‌పల్లి గ్రామంలో కోతుల బెడద తీవ్రతరం కావటంతో సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య వినూత్న విధానాన్ని అనుసరించారు. మంగళవారం పంచాయతీ సిబ్బందిలో ఒకరికి ఎలుగుబంటి వేషం పెట్టించి కోతులను తరిమే చర్యను చేపట్టారు. సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య మాట్లాడుతూ.. ఈ చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. గ్రామవాసులు సర్పంచ్ నిర్ణయాన్ని అభినందించారు.