రక్తదానంతోనే ప్రాణదానం: భరత లక్ష్మి

శ్రీకాకుళంలోని వ్యవసాయ కళాశాల నైరా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం శుక్రవారం ఉదయం కళాశాలలో నిర్వహించారు. జిల్లా రెడ్ క్రాస్ నేతృత్వంలో కాలేజీ అసోసియేట్ డీన్ డా.ఎం. భరత లక్ష్మి చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించారు. నేటి సమాజంలో రక్తం కొరత ఉందని, ప్రతీ ఒక్కరూ రక్త దానం చేయాలని ఆమె సూచించారు. మొత్తం 90 మంది రక్తదానం చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.