మెస్సీ పర్యటన.. ఉప్పల్ స్టేడియానికి డీజీపీ
TG: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి కీలక సూచనలు చేశారు. కోల్‌కతా ఘటనను స్క్రీనింగ్ చేసి చూపించారు. స్టేడియంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే స్టేడియం దగ్గర 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు.