LPG సిలిండర్ ధరల పెరుగుదలపై నిరసన

LPG  సిలిండర్ ధరల పెరుగుదలపై నిరసన

HYD: ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. LPG సిలిండర్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించి గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు.