పేదల తిరుపతిగా 'మన్యంకొండ'

పేదల తిరుపతిగా 'మన్యంకొండ'

MBNR: జిల్లాలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం రాష్ట్రంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఉన్నపోలికల వల్ల దీనిని 'తెలంగాణ తిరుపతి', 'పేదల తిరుపతి'గా పిలుస్తారు. ఆర్థిక స్థోమత లేని భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తిరుపతి వెళ్లినంత పుణ్యం దక్కుతుందని సమ్ముతారు.