పాఠశాల ప్రచార రథం ప్రారంభం
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురం ప్రాథమిక ఉన్నత మోడల్ పాఠశాలలో నూతన విద్యార్థుల నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. డిఎస్‌పి పోతిరెడ్డి శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ జండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యనుభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు.