'అన్నదాత సుఖీభవ' కార్యక్రమంలో ఎమ్మెల్యే

కృష్ణా: బంటుమిల్లి మండలం మల్లేశ్వరం మార్కెట్ యార్డులో శనివారం 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లో రూ. 16.14 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.12.10 కోట్లు సుఖీభవ కింద, రూ.4.04 కోట్లు పీఎం కిసాన్ కింద మంజూరయ్యాయని వివరించారు. మొత్తం 44,383 మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు.