BCలకు ప్రాధాన్యంపై JAC ఖుషి

BCలకు ప్రాధాన్యంపై JAC ఖుషి

HYD: మున్సిపల్ ఛైర్మన్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయడంపై బీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని బీసీ కార్యాలయంలో శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాష్ట్రవ్యాప్తంగా 54 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు కేటాయించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలను ఆయన అభినందించారు. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు.