నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

HNK: కాజీపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో నేడు శ్రీరామనవమి నవరాత్రులతో వేడుకల ఆహ్వాన పత్రికలను ఆలయ పాలకమండలి సభ్యులు ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను విడుదల చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.