ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో పోలీసుల సోదాలు
ELR: జంగారెడ్డి గూడెం ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసుల్లో మంగవారం పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఏఎస్పీ సుస్మితా రామనాథన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. ప్రతి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో లోపల, వెలుపల తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి దృశ్యాలను కనీసం 30 రోజుల పాటు భద్ర పరచాలన్నారు. అనుమానాస్పద పార్సిల్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.