హన్మకొండ ఇంఛార్జ్‌గా బూర నర్సయ్య

హన్మకొండ ఇంఛార్జ్‌గా బూర నర్సయ్య

HNK: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు హైకమాండ్ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా హన్మకొండ జిల్లా బీజేపీ ఇంఛార్జ్‌గా మాజీ ఎంపీ బూర నర్సయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలు, స్థానిక ఎన్నికలు వీరి ఆధ్వర్యంలోనే బీజేపీ ముందుకెళ్లనుంది.