మావోయిస్టు కుటుంబానికి నిత్యావసర వస్తువులు

WGL: 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న హసన్పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత మందా రూబెన్ అలియాస్ మంగన్న కుటుంబాన్ని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా కలిశారు. ఈ సందర్భంగా మావోయిస్టు తల్లికి పోలీసులు నిత్యావసర సామగ్రితో పాటు బట్టలను అందజేశారు. అనంతరం మావోయిస్టు రూబెన్ పోరు బాటను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.