VIDEO: కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
WGL: వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో 12 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. రేపు నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఇవాళ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.