పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
MHBD: పెద్దవంగర మండలంలోని పోచారం శివారు భధ్రు తండాకు చెందిన ధరావత్ సోమాని (41) వ్యవసాయం చేస్తూ జీవన సాగిస్తున్నాడు. ఇటీవల తన కూతురు వివాహం, వ్యవసాయం కోసం తీసుకొచ్చిన అప్పులు పెరగడంతో మనస్థాపం చెంది సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు.