'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి'

'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి'

KMR: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా మూడో మహాసభలకు ఆమె హాజరై మాట్లాడారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్లను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.