గుండెంగ గ్రామంలో మంచినీటి కొరత

MHBD: గూడూరు మండలంలోని గుండెంగా గ్రామ పంచాయతీ పరిధిలో గత నెల రోజులగా మంచినీటి సమస్య నెలకొందని స్థానికులు వాపోతున్నారు. గత కొద్దిరోజులుగా అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్ళినప్పటికీ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం నేపథ్యంలో మంచినీళ్లు లేక సుదూర ప్రాంతం నుండి నీటిని తీసుకొని వస్తున్నామని, మంచినీటి బెడద తీర్చాలని కోరుతున్నారు.