సురంవరంకు గుండ్రాంపల్లి నేతల నివాళులు

NLG: కమ్యూనిస్టు యోధుడు, నల్గొండ మాజీ ఎంపీ సురంవరం సుధాకర్ రెడ్డికి చిట్యాల మండలం, గుండ్రాంపల్లి గ్రామ సీపీఎం నేతలు నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ ఆసుపత్రి వరకు సాగిన అంతిమయాత్రలో గ్రామానికి చెందిన సీపీఎం జిల్లా సమితి సభ్యులు బొడిగ సైదులు, జిల్లా యాదయ్య, జిల్లా సత్యం, కేతరాజు అంజయ్య, సీమ అంజయ్య, బొడిగ లక్ష్మయ్య, బొడిగె బక్కశెట్టి పాల్గొన్నారు.