VIRAL: రోడ్డుపై బీరు పంచిన యువకులు

VIRAL: రోడ్డుపై బీరు పంచిన యువకులు

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొంతమంది చేసే పనులు చూస్తుంటే నవ్వొస్తుంది. ఈ క్రమంలో కొంతమంది యువకులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని రోడ్డుపై వెళ్లే వారికి ఆపి మరీ వారికి గ్లాసుల్లో బీరు పోసిచ్చారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎండాకాలంలో చలివేంద్రాలు చూశాం కానీ ఇలాంటివి చూడలేదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.