పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసానే ప్రధాన లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నెలా రూ.4వేల నుంచి రూ.15వేల ఆర్థిక సాయం పింఛన్ రూపంలో లభిస్తుందన్నారు.