VIDEO: 'పెన్షన్ దారులకు రావలసిన బకాయలు చెల్లించాలి'
AKP : నర్సీపట్నంలో ప్రభుత్వ పెన్షనర్ల వార్షిక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు గజాలమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెన్షన్ పొందడం ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. పెన్షన్ దారులకు ఇవ్వవలసిన డిఏలు వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు.