తీవ్రంగా నష్టపోయిన జిల్లాలో మోదీ పర్యటన

మణిపూర్‌లోని హింసతో తీవ్రంగా నష్టపోయిన చురచంద్‌పూర్ జిల్లాలో PM మోదీ రేపు పర్యటించనున్నారు. కుకీ, మైతేయ్ వర్గాల మధ్య అల్లర్లలో ఈ జిల్లాలో దాదాపు 260 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అల్లర్ల తర్వాత మోదీ ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ద్వారా ప్రధాని శాంతి, భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సందేశం ఇవ్వనున్నారని అధికారులు పేర్కొన్నారు.