నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

MDK: ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. రామాయంపేటకు చెందిన పుష్ప ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పుష్ప పరిస్థితి విషమంగా ఉంది.