పెరిగిన చలి.. వారు జాగ్రత్తగా ఉండాలి
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. నిన్న AP అల్లూరి జిల్లా జి.మాడుగులలో 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12, చింతపల్లిలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. TGలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.