వాజపేయి వల్లే ఈ అభివృద్ధి: మంత్రి సత్యకుమార్

వాజపేయి వల్లే ఈ అభివృద్ధి: మంత్రి సత్యకుమార్

AP: దేశ ప్రగతికి వాజపేయి వేసిన పునాదే కారణమని మంత్రి సత్యకుమార్ కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 'సుపరిపాలన యాత్ర'ను ప్రారంభించిన ఆయన.. వాజపేయి సేవలను గుర్తుచేసుకున్నారు. 23 పార్టీలతో కూటమి కట్టినా అద్భుతమైన పాలన అందించిన అజాత శత్రువు ఆయనేనని అన్నారు. గ్రామీణ సడక్ యోజనతో 8 లక్షల కి.మీల రోడ్లు వేశారని, ఆయన బాటలోనే ఇప్పుడు ముందుకెళ్తున్నామని తెలిపారు.