అంకోలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంకోలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మడవి కిషన్ మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు.